గల్ఫ్- తిరువనంతపురం మధ్య ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- October 18, 2025
యూఏఈ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వింటర్ షెడ్యూల్‌పై ఉన్న అనిశ్చితి తొలిగింది. కేరళకు ప్రయాణించే యూఏఈ నివాసితులు ఇప్పుడు తిరువనంతపురంకు విమాన సేవలను కొనసాగించవచ్చు. రాబోయే వింటర్ సీజన్ (అక్టోబర్ 2025-మార్చి 2026) కోసం కేరళ మరియు గల్ఫ్ దేశాల మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిర్వహించే ఫ్లైట్స్ సంఖ్యను తగ్గించాలని ఎయిర్ ఇండియా యోచిస్తోందని అంతకుముందు వార్తలు వచ్చాయి.
అయితే, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తిరువనంతపురం నుండి కీలకమైన గల్ఫ్ మార్గాలను పునరుద్ధరిస్తుందని భారత పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ ప్రకటించారు. అక్టోబర్ 28 నుండి దుబాయ్ మరియు డిసెంబరు 3 నుండి అబుదాబి ఫ్లైట్స్ పునఃప్రారంభమవుతాయని ఎయిర్‌లైన్ ధృవీకరించిందని థరూర్ ఎక్స్ లో ఒక పోస్ట్ లో తెలిపారు.
ప్రస్తుతం సమ్మర్ షెడ్యూల్లో ఫ్లైట్స్ రన్ అవుతున్నాయని, త్రివేండ్రం-దుబాయ్-త్రివేండ్రం మార్గంలో బుకింగ్‌లు అక్టోబర్ 27 వరకు ఓపెన్ గా ఉన్నాయని డీరా ట్రావెల్ అండ్ టూరిస్ట్ ఏజెన్సీ జనరల్ మేనేజర్ సుధీష్ తెలారు. ఇంతకుముందు, అక్టోబర్ 28 నుండి సర్వీసులు నిలిపివేయబడతాయని భావించామని, కానీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వాటిని పునరుద్ధరించిందని తెలిపారు. తాము ఇప్పుడు వింటర్ సీజన్ కు సంబంధించి బుకింగ్‌లను కూడా చేస్తున్నామని సుధీష్ వెల్లడించారు.
ఎయిరిండియా కూడా 2026 నాటికి కేరళ నుంచి అంతర్జాతీయ విమానాల సంఖ్య 231కి, దేశీయ విమానాల సంఖ్య 245కి పెరుగుతుందని, ప్రస్తుత కొనసాగుతున్న కొరతను అధిగమిస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం
- జువెనైల్ హోం లో బాలుర పై లైంగిక దాడులు
- హైకోర్టు జడ్జిగా జస్టిస్ రమేష్ ప్రమాణం
- హైదరాబాద్‌లో స్టార్టప్ సమ్మిట్
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక ట్రామా సేవలకు నూతన ప్రమాణం
- ఒమన్ పై UNICEF ప్రశంసలు..!!
- కంపెనీలు వేజ్ సపోర్టును దుర్వినియోగం చేస్తున్నాయా?
- సౌదీలో భారీగా క్యాప్తగోన్ పిల్స్ పట్టివేత..!!
- గల్ఫ్- తిరువనంతపురం మధ్య ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!