సౌదీలో భారీగా క్యాప్తగోన్ పిల్స్ పట్టివేత..!!
- October 18, 2025
రియాద్: సౌదీ అరేబియాలోకి ప్రవేశించే ట్రక్కులో డ్రగ్స్ దాచిపెట్టిన డ్రగ్స్ ను అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అల్-హదితా సరిహద్దు క్రాసింగ్ వద్ద 47,927 యాంఫెటమైన్ (క్యాప్టాగాన్) పిల్స్ ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) విఫలం చేసినట్లు ప్రకటించింది.
సెక్యూరిటీ స్క్రీనింగ్ టెక్నాలజీలు మరియు లైవ్ డిటెక్షన్ లను ఉపయోగించి కస్టమ్స్ అధికారులు వాటిని గుర్తించి, అడ్డుకున్నట్లు అథారిటీ అధికార ప్రతినిధి హమూద్ అల్-హర్బీ తెలిపారు. స్మగ్లింగ్ను ఎదుర్కోవడానికి ప్రజలకు సహాయం చేయాలని ఆయన కోరారు. ఏదైనా సమాచారం తెలిస్తే.. పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సరైన సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం అందిజేయబడుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం
- జువెనైల్ హోం లో బాలుర పై లైంగిక దాడులు
- హైకోర్టు జడ్జిగా జస్టిస్ రమేష్ ప్రమాణం
- హైదరాబాద్లో స్టార్టప్ సమ్మిట్
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక ట్రామా సేవలకు నూతన ప్రమాణం
- ఒమన్ పై UNICEF ప్రశంసలు..!!
- కంపెనీలు వేజ్ సపోర్టును దుర్వినియోగం చేస్తున్నాయా?
- సౌదీలో భారీగా క్యాప్తగోన్ పిల్స్ పట్టివేత..!!
- గల్ఫ్- తిరువనంతపురం మధ్య ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!