కెపిటల్ గవర్నరేట్‌లో భద్రత, ట్రాఫిక్ క్యాంపెయిన్..!!
- October 19, 2025
కువైట్: భద్రతాను బలోపేతం చేయడానికి మరియు ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెస్క్యూ పోలీస్ కెపిటల్ గవర్నరేట్‌లోని వివిధ ప్రాంతాలలో అవేర్ నెస్ క్యాంపెయిన్ ను నిర్వహించింది. మొబైల్ టీమ్స్ ద్వారా నిర్వహించిన ఈ ఆపరేషన్.. రోడ్లపై ప్రజల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.
డైరెక్టరేట్ ప్రకారం ఈ క్యాంపెయిన్ సందర్భంగా 519 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే, ఇద్దరు వాంటెడ్ వ్యక్తుల అరెస్టు చేయగా, మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లో ఇద్దరిని, నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అన్ని గవర్నరేట్లలో 24 గంటలూ ఇటువంటి అవేర్ నెస్ క్యాంపెయిన్ లు కొనసాగుతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







