ఫ్లైట్ లో లిథియం బ్యాటరీ పేలుడు..ప్రయాణికులు షాక్‌..!!

- October 19, 2025 , by Maagulf
ఫ్లైట్ లో లిథియం బ్యాటరీ పేలుడు..ప్రయాణికులు షాక్‌..!!

యూఏఈ: ఫ్లైట్ ఓవర్ హెడ్ బిన్‌లో లిథియం బ్యాటరీ లో పేలడంతో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఎయిర్ చైనా విమానం అత్యవసర ల్యాండింగ్ చేసింది. CA139 నంబర్ విమానం స్థానిక కాలమానం ప్రకారం అక్టోబర్ 18న ఉదయం 09.47 గంటలకు హాంగ్‌జౌ జియావోషన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి, తెల్లవారుజామున 12.20 గంటలకు ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. ఆ తరువాత షాంఘైలో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది.

ఫ్లైట్ ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణీకుల క్యారీ-ఆన్ లగేజీలోని లిథియం బ్యాటరీ ఆకస్మికంగా పేలిందని ఎయిర్ చైనా ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఫ్లైట్ సిబ్బంది వెంటనే స్పందించారని. మంటలను అదుపుచేశారని పేర్కొంది. విమానం షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్ లైన్ తెలిపింది.

కాగా, ఈ నెల ప్రారంభంలో ఎమిరేట్స్ పవర్ బ్యాంకుల వాడకాన్ని నిషేధించింది. అయితే, ప్రయాణీకులు ఇప్పటికీ 100 వాట్-గంటల (Wh) కంటే తక్కువ శక్తి కలిగిన ఒక పవర్ బ్యాంక్‌ను తీసుకెళ్లవచ్చు.  కానీ ఆ పరికరాన్ని విమానంలో ఉపయోగించడానికి అనుమతించరు. లిథియం బ్యాటరీలతో ప్రమాదాల తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com