అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌..

- October 19, 2025 , by Maagulf
అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌..

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాళ్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. నేడు (ఆదివారం అక్టోబ‌ర్ 19) పెర్త్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఈ మ్యాచ్ రోహిత్ శ‌ర్మకు 500వ మ్యాచ్.

ఇక భార‌త్ త‌రుపున 500 ల‌కు పైగా అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఐదో ఆట‌గాడిగా రోహిత్ శ‌ర్మ ఘ‌న‌త సాధించాడు. ఈ జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్ర‌విడ్‌, ఎంఎస్ ధోని లు ఉన్నారు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో భార‌త్ త‌రుపున 500 పైగా అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాళ్లు..

  • సచిన్ టెండూల్క‌ర్ – 664 మ్యాచ్‌లు
  • విరాట్ కోహ్లీ – 551 మ్యాచ్‌లు
  • ఎంఎస్ ధోని – 535 మ్యాచ్‌లు
  • రాహుల్ ద్ర‌విడ్ – 504 మ్యాచ్‌లు
  • రోహిత్ శ‌ర్మ – 500 మ్యాచ్‌లు

2007 లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 67 టెస్టులు, 274 వ‌న్డేలు, 159 టీ20 లు ఆడాడు.టెస్టుల్లో 40.6 స‌గ‌టుతో 4301 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 శ‌త‌కాలు, 18 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. వ‌న్డేల్లో 265 ఇన్నింగ్స్‌ల్లో 48.8 స‌గ‌టుతో11,168 ప‌రుగులు సాధించాడు. ఇందులో 32 శ‌త‌కాలు, 58 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. 151 టీ20 ఇన్నింగ్స్‌లో 4231 ప‌రుగులు సాధించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com