ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- October 25, 2025
దుబాయ్: ప్రవాసాంధ్రుల సంక్షేమం అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టి సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అందిస్తోంది.ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ లో ప్రారంభించారు.ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు లబ్ధి పొందవచ్చు. ఉద్యోగులు,వలస కార్మికులు మరియు విద్యార్థుల కొరకు ఈ పథకం ప్రవేశపెట్టబడింది. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఆకాంక్షిస్తున్నారు.ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి https://apnrts.ap.gov.in/insurance వెబ్ సైట్ ను సందర్శించగలరు.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







