కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- October 25, 2025
వాట్సాప్(WhatsApp Scam) యూజర్లు జాగ్రత్తగా ఉండాలని యాప్ తాజాగా హెచ్చరించింది. కొత్త రకమైన స్కామ్‌లో మోసగాళ్లు యూజర్ల డేటాను దొంగిలించి డబ్బు కాజేస్తున్నారు. ఈ స్కామ్ ముఖ్యంగా వాట్సాప్‌లో(WhatsApp Scam) నమ్మదగిన వ్యక్తుల పేరుతో సందేశాలు పంపడం ద్వారా జరిగిపోతుంది.
స్కామ్ ఇలా జరుగుతుంది:
- గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్‌లో మెసేజ్ పంపుతారు.
- మెసేజ్‌లో ఎమర్జెన్సీ లేదా తక్షణ చర్య అవసరమని చెప్పి, బంధువుల లేదా స్నేహితుల పేర్లను వాడి users ను భయపెడతారు.
- ఆ తర్వాత లింక్ క్లిక్ చేయమని, క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయమని, లేక డబ్బు పంపమని అడుగుతారు.
- యూజర్ ఈ సూచనలు పాటిస్తే, పూర్తి మోసం జరుగుతుంది.
జాగ్రత్తలు మరియు సురక్షితంగా ఉండే మార్గాలు
- గుర్తు తెలియని వ్యక్తులకు OTP, పాస్వర్డ్, PIN వంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దు.
- వాట్సాప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను(Two-step verification) ఎనేబుల్ చేయడం ద్వారా అకౌంట్ సురక్షితం చేయండి.
- అనుమానాస్పద మెసేజ్‌లను వెంటనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి.
- మీకు తెలిసిన వ్యక్తి అని అనిపించినా, డబ్బు అవసరమని మెసేజ్ వస్తే కాల్ చేసి నిజంగా చెక్ చేయండి.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







