ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

- October 25, 2025 , by Maagulf
ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

దుబాయ్: ప్రవాసాంధ్రుల సంక్షేమం  అభివృద్ధి,  భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టి సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అందిస్తోంది.ఈ పథకాన్ని  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ లో ప్రారంభించారు.ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు లబ్ధి పొందవచ్చు. ఉద్యోగులు,వలస కార్మికులు మరియు విద్యార్థుల కొరకు ఈ పథకం ప్రవేశపెట్టబడింది. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఆకాంక్షిస్తున్నారు.ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి https://apnrts.ap.gov.in/insurance వెబ్ సైట్ ను సందర్శించగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com