యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!

- October 25, 2025 , by Maagulf
యూఏఈలో గీత దాటిన టీచర్లపై \'క్రమశిక్షణా\' చర్యలు..!!

యూఏఈ: యూఏఈ పాఠశాలల్లో, ఉపాధ్యాయులు మరియు కౌన్సెలర్లు "క్రమశిక్షణ" అంటే ఏమిటో ఆలోచిస్తున్నారు. విద్యా మంత్రిత్వ శాఖ (MoE) ఈ విద్యా సంవత్సరానికి సమగ్ర విద్యార్థి ప్రవర్తన నియమావళిని విడుదల చేసింది.  ఇది 46 రకాల ఉల్లంఘనలను మరియు సంబంధిత క్రమశిక్షణా చర్యలను కేటగిరులగా వివరించారు.

భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన కేరళలో పాఠశాలలో అవమానించారని 14 ఏళ్ల యూఏఈ వలసదారుడి కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం వివాదానికి దారితీసంది. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది.   

“పిల్లలు చేసే చిన్న ప్రయత్నాలను కూడా టీచర్లు గుర్తించాలని, తరచూ అంతరాయం కలిగించే విద్యార్థులు ప్రత్యేక దృష్టిని కోరుకుంటారని అంబాసిడర్ స్కూల్ షార్జా ప్రిన్సిపాల్ ఆరోగ్య రెడ్డి తెలిపారు. చిన్న చిన్న అభినందన కూడా విద్యార్థుల్లో ఎంతో ప్రేరణను పెంచుతుందని తెలిపారు.  తమ పాఠశాలలో సమస్యలను మొదట కౌన్సెలర్లు పరిష్కరిస్తారని వెల్లడించారు.     

సాధారణంగా యూఏఈలోని స్కూల్ పిల్లలు మరింత క్రమశిక్షణతో ఉంటారని, యూఏఈలో ప్రత్యేకమైన లెర్నింగ్ ప్రక్రియలు ఉంటాయని, మంచి వాతావరణంలో పెరుగుతారని షార్జా ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రమోద్ మహాజన్ తెలిపారు. అప్పుడప్పుడు దారి తప్పే విద్యార్థుల కోసం, తాము డిగ్రీ 1, డిగ్రీ 2, మొదలైన వాటిని సరిదిద్దే చర్యలను అమలు చేస్తున్నామని వివరించారు.  కౌన్సెలర్లు మరియు ఉపాధ్యాయులు CCTV నిఘా, భద్రతా అధికారుల సహాయంతో విద్యార్థులను నిశితంగా పర్యవేక్షిస్తారని ఆయన అన్నారు.  

పాఠశాలలోని అంతర్గత IT సెల్ కూడా విద్యార్థుల సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందన్నారు. "విద్యార్థులు ఉపాధ్యాయులు లేదా పాఠశాల గురించి అనుచితంగా ఏదైనా పోస్ట్ చేయకుండా చూసుకోవడానికి" అని ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com