భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- October 26, 2025
దమ్మామ్ః ఆన్లైన్లో ప్రసారం అవుతున్న వీడియోలో ఒక భారతీయ ప్రవాసి ఒకరు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు, తనకు సాయం చేయాలని కోరారు. అయితే, సదరు వీడియోలో పేర్కొన్న విధంగా సదరు వ్యక్తి వాదనలను తూర్పు ప్రావిన్స్ పోలీసులు ఖండించారు. ఆ వ్యక్తిని విచారణ కోసం పిలిపించామని, తన సోషల్ మీడియా అకౌంట్లో వీక్షణలను పెంచుకోవడానికే ఆ వీడియోను చిత్రీకరించి పోస్ట్ చేసినట్టు నిర్ధారించామని పోలీసులు తెలిపారు. ప్రవాసియునికి మరియు అతని యజమానికి మధ్య ఎటువంటి వివాదం లేదని అధికారులు అన్నారు. సంబంధిత అధికారుల సమన్వయంతో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒమన్‌లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







