తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- March 12, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 8 నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత హైదరాబాద్ (HYD) సహా వివిధ జిల్లా కేంద్రాల్లోని రహదారులపై జన సంచారం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పని దినమైన ఏప్రిల్ 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించుకోవచ్చునని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయని అన్నారు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలు కూడా కచ్చితంగా ఒంటిపూట పనిచేయాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఎవరికీ మినహాయింపు ఉండదని.. మధ్యాహ్నం తర్వాత స్కూళ్లు తెరిచి ఉండటానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి.. వేసవి సెలవులపై కూడా తెలంగాణ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది.ఏఫ్రిల్ 23 స్కూళ్లకు చివరి పని దినం కాగా.. ఏఫ్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్, ప్రైవేటు స్కూళ్లకు ఎండాకాలం సెలవులు ప్రారంభం అవుతాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







