అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- October 27, 2025
దోహా: అల్ వక్రా పోర్టులో లంగరు వేసిన అనేక ఫిషింగ్ బోట్లను దహనం చేసిన అగ్నిప్రమాదం కేసులో పురోగతి నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆసియా సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) తెలిపింది. ఇద్దరు నిందితులు ఒక పడవ నుండి మరొక పడవకు చట్టవిరుద్ధంగా విద్యుత్ లైన్ను కనెక్ట్ చేయడంతో మంటలు చెలరేగాయని ప్రాథమిక, పోరెన్సిక్ విచారణలో తేలిందని వెల్లడించారు. అక్టోబర్ 22న ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకొని, సకాలంలో స్పందించిన ఫైర్ ఫైటర్స్ మంటలను వేగంగా అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







