ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- October 27, 2025
మనామాః బహ్రెయిన్ ప్రపంచ ప్రముఖ పర్యాటక దేశాలలో ఒకటిగా ఎదుగుతోంది. ముఖ్యంగా ఆతిథ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో ఆకర్షిస్తుంది. బహ్రెయిన్ పర్యాటక రంగం విజయంలో ఆతిథ్య పరిశ్రమ కీలక భాగస్వామి అని, పర్యాటక వ్యూహం 2022–2026 లక్ష్యాలను సాధించడంలో చురుకైన పాత్ర పోషిస్తుందని పర్యాటక మంత్రి హర్ ఎక్సలెన్సీ ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ స్పష్టం చేశారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా బహ్రెయిన్ ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా ఎదుగుతుందని తెలిపారు. ఆతిథ్య రంగ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సంవత్సరం పర్యాటక రంగం పనితీరుకు సంబంధించిన కీలక అంశాలను వెల్లడించారు. జాతీయ పర్యాటక పర్యావరణ వ్యవస్థలో ఆతిథ్యం ఒక కీలకమైన అంశం అని వివరించారు.మంత్రిత్వ మరియు హోటళ్ల యజమానుల మధ్య సన్నిహిత భాగస్వామ్యం సేవల నాణ్యతను పెంచడానికి దోహదం చేస్తుందని తెలిపారు.ఈ సంవత్సరం గతంలో కంటే మరింత వైవిధ్యమైన పర్యాటక అనుభవాలతో వస్తుందని, త్వరలోనే పూర్తి క్యాలెండర్ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







