కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!

- October 27, 2025 , by Maagulf
కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!

కువైట్: ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్ ను కువైట్ లో ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు టూరిస్టిక్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ (TEC) వింటర్ వండర్‌ల్యాండ్ కువైట్ నాల్గవ ఎడిషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది నవంబర్ 6 ప్రారంభం కానుంది. ఇది సందర్శకులకు ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్‌తో సహా 60 కంటే ఎక్కువ గేమ్స్ ను అందించనుందని TEC సీఈఓ అన్వర్ అల్-హులైలా తెలిపారు.   

వింటర్ వండర్ల్యాండ్ కువైట్ అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ వెంబడి 1 లక్ష 29 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.  హై-స్పీడ్ రోలర్ కోస్టర్‌లు మరియు పిల్లల రైడ్‌ల నుండి అన్ని వయసుల వారికి 60 కి పైగా వినూత్నమైన గేమ్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు ప్రకటించారు.  ముఖ్యంగా ఈ సీజన్ లో హర్రర్ కోటలు, కువైట్‌లోని అతిపెద్ద అవుట్‌డోర్ స్కేటింగ్ రింక్, సినిమా గేమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్వర్ అల్-హులైలా తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com