లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- October 27, 2025
దోహా: M.F. హుస్సేన్ మ్యూజియం లాహ్ వా కలాం అంటే "ది కాన్వాస్ అండ్ ది పెన్". ఖతార్ సాంస్కృతిక వైభవానికి ఇది కొత్త ఆకర్షణను జోడించనుంది. ఎడ్యుకేషన్ సిటీలో నవంబర్‌లో ప్రారంభించనున్న ఈ మ్యూజియం మక్బూల్ ఫిదా హుస్సేన్ జీవితాన్ని తెలియజేస్తుందని ఖతార్ ఫౌండేషన్ (QF)లోని కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ అండ్ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖోలౌద్ అల్ అలీ తెలిపారు.
లాహ్ వా కలాం.. భారతదేశం, అరబ్ ప్రపంచంతో ఖతార్ సంస్కృతుల కలయికను భావి తరాలకు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ వర్క్‌షాప్‌లు, చర్చలు మరియు ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్‌ల ద్వారా భివిష్యత్ తరాలకు లాహ్ వా కలాం కళా వారసత్వాన్ని అందజేస్తుందని అన్నారు.
ఈ ల్యాండ్ మార్క్ భవనానికి ఆర్కిటెక్ట్ మార్తాండ్ ఖోస్లా జీవం పోశారు. ఇందులో విశాలమైన గ్యాలరీలు, 360-డిగ్రీల ఇంటరాక్టివ్ రూమ్, మినీ మల్టీమీడియా థియేటర్లు, ఆర్కైవల్ ఆడియో, స్కెచ్ ప్రొజెక్షన్‌లు వంటి ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉందని అల్ అలీ అన్నారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







