సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!

- October 27, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!

రియాద్: సౌదీ అరేబియా చమురుయేతర ఎగుమతులు పెరిగాయి. 2024 ఆగస్టు నెలతో పోలిస్తే 2025 ఆగస్టులో 5.5 శాతం పెరుగుదలను నమోదు చేశాయని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) బులెటిన్ తెలిపింది. వాణిజ్య బ్యాలెన్స్ 4.1 శాతం మిగులు వృద్ధిని నమోదు చేసింది.  ఇది 24.2 బిలియన్ సౌదీ అరేబియా మొత్తం చమురుయేతర ఎగుమతుల్లో యంత్రాలు, విద్యుత్ పరికరాలు మరియు విడిభాగాలు 25.4 శాతం వాటాను కలిగి ఉండగా, రసాయన ఉత్పత్తులు 22.7 శాతంతో రెండవ స్థానంలో ఉన్నాయి.

దిగుమతి పరంగా చూస్తే.. యంత్రాలు, విద్యుత్ పరికరాలు మరియు విడిభాగాలు మొత్తం దిగుమతుల్లో 29.8 శాతం ఉన్నాయి. ఇది గతేడాది కంటే 24.7 శాతం పెరుగుదల నమోదైంది.  

మరోవైపు చమురు ఎగుమతులు కూడా 7 శాతం పెరిగాయి.  సౌదీ అరేబియా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా కొనసాగుతోంది. మొత్తం ఎగుమతుల్లో 16.2 శాతం మరియు మొత్తం దిగుమతుల్లో 26.4 శాతం వాటాను కలిగి ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 11.1 శాతం ఎగుమతులు మరియు 5.4 శాతం దిగుమతులతో రెండవ స్థానంలో ఉండగా, ఇండియా 9.2 శాతం ఎగుమతులతో మూడవ స్థానంలో ఉంది. దమ్మామ్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఓడరేవు దిగుమతులకు ప్రధాన కేంద్రంగా, మొత్తంలో 25.6 శాతం ఎగుమతులు, దిగుమతులు ఇక్కడి నుండే జరిగాయి. ఆ తరువాత జెడ్డా ఇస్లామిక్ ఓడరేవు 21.9 శాతంతో రెండో స్థానంలో ఉందని స్టాటిస్టిక్స్ అథారిటీ బులెటిన్ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com