సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- October 28, 2025
రియాద్: సౌదీ అరేబియాలో ప్రైవేట్ రంగంలో స్టానికీకరణను వేగవంతం చేయనున్నారు. ముఖ్యంగా అకౌంటింగ్ ప్రొఫేషన్ లో స్థానికీకరణ రేటును 40 శాతం పెంచేందుకు ఉద్దేశించిన మొదటి దశ అక్టోబర్ 27 నుండి అమల్లోకి వచ్చింది. ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది అకౌంటెంట్లను నియమించే సంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
కనీస వేతనం బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగిన వారికి SR6,000 మరియు డిప్లొమా లేదా దానికి సమానమైన అర్హత కలిగిన వారికి SR4,500గా నిర్ణయించారు. రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఐదు దశల్లో స్థానికీకరణను 70శాతానికి చేర్చనున్నారు.
చట్టాలను ఉల్లంఘించినవారిపై చట్టపరమైన జరిమానాలను విధిస్తామని మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఉత్తర్వులను అమలు చేసే ప్రైవేట్ రంగ సంస్థలకు తగిన మద్దతు, ప్రోత్సాహక ప్రయోజనాలు అందిస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







