బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- October 28, 2025
మనామా: బహ్రెయిన్, సౌదీ అరేబియా మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ప్రధానమంత్రి ఆస్థాన మంత్రి షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ బేలోని బహ్రెయిన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (EDB) ప్రధాన కార్యాలయంలో సౌదీ అరేబియా మంత్రుల మండలి సభ్యుడు హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ తుర్కి బిన్ మొహమ్మద్ బిన్ ఫహద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ సమావేశం అయ్యారు.
బహ్రెయిన్ -సౌదీ అరేబియా మధ్య చారిత్రాత్మక భాగస్వామ్యం ఉందని తెలిపారు. పోటీతత్వాన్ని పెంచే మరియు స్థిరమైన ఆర్థిక విస్తరణకు మద్దతు ఇచ్చే వ్యూహాత్మక కార్యక్రమాలు బహ్రెయిన్ EDB జాతీయ వృద్ధికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశం సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, ఎకనామిక్ విజన్ 2030 కింద బహ్రెయిన్ ఆర్థిక పనితీరు మరియు పురోగతిపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







