డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- October 28, 2025
శ్రేయస్ అయ్యర్: గాయపడి డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు కోలుకునే దశలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో మూడో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అయ్యర్‌కు, తీవ్ర అంతర్గత గాయాలు అయినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చి, వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఘటన వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని వెనక్కి పరుగెత్తి అద్భుతంగా క్యాచ్ పట్టిన అయ్యర్, అదే క్రమంలో ఎడమ పక్కటెముకల వద్ద బలంగా తగిలి గాయపడ్డాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న ఆయన, కొద్ది సేపటికే స్పృహతప్పి పడిపోయారు. వెంటనే జట్టు వైద్య సిబ్బంది స్పందించి సిడ్నీలోని ఒక ఆసుపత్రికి తరలించారు.
తరువాత నిర్వహించిన స్కానింగ్ పరీక్షల్లో ప్లీహానికి (స్ప్లీన్) గాయం జరిగినట్లు తేలింది. బీసీసీఐ ప్రకటనలో, “శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకల కింద గాయపడ్డాడు. స్కానింగ్‌లో ప్లీహానికి గాయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు” అని తెలిపింది. బీసీసీఐ వైద్య బృందం, సిడ్నీ మరియు భారత వైద్య నిపుణులతో కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా గమనిస్తోంది. అయ్యర్‌తో పాటు టీమిండియా వైద్యుడు సిడ్నీలోనే ఉండి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి, ఆయన కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. మొదట మూడు వారాల్లో కోలుకుంటారని భావించినా, అంతర్గత రక్తస్రావం కారణంగా ఈ వ్యవధి పెరిగే అవకాశం ఉంది. కనీసం వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణ అయినప్పుడే భారత్‌కు తిరిగి పంపే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ







