విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!

- October 28, 2025 , by Maagulf
విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!

రియాద్: సౌదీ అరేబియాలో విషాదం చోటుచేసుకుంది. దక్షిణ అసిర్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో 4 యూనివర్సిటీ విద్యార్థినులు మరణించారు. ఆదివారం దక్షిణ అసిర్ ప్రాంతంలోని బిషా-ఖామిస్ ముషాయిత్ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిషా యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థినులు మరణించగా, ఐదవ వ్యక్తి గాయపడ్డారు.

మరోవైపు ప్రమాదంలో మరణించిన విద్యార్థులకు బిషా యూనివర్సిటీ సంతాపం తెలిపింది, గాయపడిన విద్యార్థి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ ఘోర ప్రమాదంపై నెటిజన్లు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com