ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!

- October 28, 2025 , by Maagulf
ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!

యూఏఈ: యూఏఈలోని ఓ బ్యాంకులో దొంగతనం జరిగిన గంటల్లోనే నిందితులను ఫుజైరా పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 23న ఉదయం 10.50 గంటలకు ఒక మహిళా బ్యాంకు కస్టమర్ తనను మోసగించి, 195,000 దిర్హామ్‌లను దోచుకున్నట్లు ఆపరేషన్స్ రూమ్‌కు ఫిర్యాదు అందింది.  ఆమె వాహనం వెనుక టైర్‌లో సమస్య ఉందని చెప్పి నేరస్థులు ఆమెను తెలివిగా మోసం చేశారు. ఆమె టైర్ ను చూసేందుకు బయటకు రాగా, ముఠా ఆమె వద్ద నున్న డబ్బును దొంగిలించి అక్కడి నుండి జారుకున్నారు.

సమాచారం అందగానే దర్యాప్తు బృందం వెంటనే రంగంలోకి దిగింది.  అనుమానితులను గుర్తించి సమాచారాన్ని సేకరించడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కేవలం మూడు గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.  ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు  చేశారు. బ్యాంకుల నుంచి వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచితులతో మాట్లాడవద్దని అన్నారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించాలని ఫుజైరా పోలీసుల ప్రజలను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com