ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!

- October 28, 2025 , by Maagulf
ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!

దోహా: ప్రపంచ ధోరణులకు అనుగుణంగా, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి దోహా మెట్రోపాలిస్ ISO ప్రమాణాలను స్వీకరించనుంది. ఈ మేరకు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉత్తరాన లుసైల్ నుండి దక్షిణాన అల్ వక్రా వరకు, దోహా, అల్ వక్రా, అల్ రయాన్, ఉమ్ సలాల్ మరియు అల్ దాయెన్ ప్రధాన మునిసిపాలిటీలను కవర్ చేస్తూ విస్తరించి దోహా మెట్రోపాలిస్ ప్రాజెక్ట్ ఉంది. 

ఈ ప్రాజెక్ట్ ISO 37120 నగర డేటా ప్రమాణాలను స్వీకరిస్తుంది. దీనిని వరల్డ్ కౌన్సిల్ ఆన్ సిటీ డేటా (WCCD) సహకారంతో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అభివృద్ధి చేసింది. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, పట్టణ ప్రణాళిక మరియు అత్యవసర ప్రతిస్పందన వంటి 19 కీలక కోణాలలో 90 నుండి 104 సూచికలను విజయవంతంగా అమలు చేయనున్నారు. ఈ ప్రమాణాలను స్వీకరించడం ద్వారా ఖతార్ ప్రపంచ పర్యావరణ మరియు సామాజిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉన్న దేశంగా గుర్తింపు పొందనుంది.  దీంతోపాటు ప్రపంచ స్మార్ట్ సిటీస్ నెట్‌వర్క్‌లో దోహాను నిలుపుతుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com