ఐఎస్ అనుమానిత ఉగ్రవాది అరెస్టు..
- July 23, 2016
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు. కేరళ పోలీసులు, మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం సంయుక్తంగా చేప్టటిన గాలింపు చర్యల్లో ఈ ఉగ్రవాది పట్టుబట్టాడు. అతనిని మహారాష్ట్రలోని పర్భణి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సిరియాలోని ఐఎస్ దళాల్లో పనిచేస్తున్న వాంటెడ్ క్రిమినల్ ఫరూక్‌తో సమాచార సంబంధాల కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఈనెల మొదట్లో కూడా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ జరిపిన గాలింపుల్లో ఐఎస్ సభ్యులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్టు అనుమానిస్తున్న 31 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. జూన్ 29న హైదరాబాద్ పాతబస్తీలోని పది ప్రాంతాల్లో గాలింపులు జరిపిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 11 మంది యువకులను నిర్బంధంలోకి తీసుకుంది. ఆ మరుసటి రోజే ఇండియాలో టెర్రరిస్టు దాడులకు ఐఎస్ నుంచి ఆదేశాలు అందుకున్నట్టుగా అనుమానిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ ప్రకటించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







