'వేదాళం' స్టోరీపై పవన్ ఫోకస్..
- July 23, 2016
సర్దార్ గబ్బర్‌సింగ్ మూవీ వచ్చి మూడునెలలు గడిచిపోయింది. ఇప్పటివరకు పవన్‌కల్యాణ్ కొత్త సినిమా మొదలుకాలేదు. సూర్య కాంబినేషన్ ఓ చిత్రానికి పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగానే వెనక్కివెళ్లిపోయింది. ఈలోగా డాలీతో మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఆగష్టుతో సెట్స్ పైకి వెళ్తుందని నిర్మాత శరత్ చెప్పుకొచ్చాడు. లేటెస్ట్‌గా కోలీవుడ్ డైరెక్టర్‌తో పవన్ కొత్త మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
అజిత్ హీరోగా 'వేదాళం' స్టోరీపై పవన్ బాగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, పవన్‌తో సంప్రదింపులు చేస్తున్నాడట. ఈ రీమేక్‌ను తాను నిర్మిస్తానని ఆయన ముందుకొచ్చినట్టు సమాచారం. మరోవైపు పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా స్టోరీలో కాస్త మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఇన్‌సైడ్ సమాచారం. అంతా ఓకే అయితే.. రీమేక్‌కు నేసన్ డైరెక్ట్ చేసే ఛాన్స్ వుందని చెబుతున్నారు. ఆ మధ్య విజయ్-మోహన్‌లాల్ కాంబోలో వచ్చిన 'జిల్లా'కి డైరెక్టర్ ఈయనే! మొత్తానికి ఓవైపు డాలీ, మరోవైపు నేసన్, ఇంకోవైపు త్రివిక్రమ్‌లతో పవన్ బిజీ అన్నమాట.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







