కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- October 29, 2025
కువైట్: కువైట్ లో విదేశీయుల చెల్లింపుల్లో పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది ప్రథమార్థంలో కువైట్ నుండి విదేశీయుల చెల్లింపులు 23.7% వృద్ధిని నమోదు చేశాయి. గత సంవత్సరం ఇదే కాలంలో KWD 2.053 బిలియన్ల కువైట్ దినార్లతో పోలిస్తే ఇది 2.541 బిలియన్ల కువైట్ దినార్లకు చేరుకుందని ఇటీవల విడుదల చేసిన అధికారిక చెల్లింపుల బ్యాలెన్స్ డేటా తెలిపింది.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ రెమిటెన్స్ పెరుగుదల 487.5 మిలియన్ కువైట్ దినార్లకు పెరిగింది. ఈ పెరుగుదల కువైట్ లేబర్ మార్కెట్లో 4.1% విస్తరణతో సమానంగా నిలిచింది. 2025 మధ్య నాటికి ఈ సంఖ్య 2.2 మిలియన్లకు చేరుకుంది. దీని ద్వారా 88,400 మంది ఉద్యోగులు కొత్తగా పెరిగారు.
త్రైమాసిక డేటా ప్రకారం, మొదటి త్రైమాసికంలో 1.226 బిలియన్ కువైట్ దినార్లు ఉండగా, రెండవ త్రైమాసికంలో రెమిటెన్స్ 9.5% పెరిగి 1.342 బిలియన్ కువైట్ దినార్లుగా ఉంది.
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు







