అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- October 29, 2025
యూఏఈ: అద్దెదారులకు షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. రియల్ ఎస్టేట్ లీజింగ్ మరియు దాని కార్యనిర్వాహక నిబంధనలను సవరణకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. సెప్టెంబర్ 19, 2024కి ముందు గడువు ముగిసిన ఒప్పందాలను క్రమబద్ధీకరించుకోని అద్దెదారులకు విధించిన జరిమానాలను పూర్తిగా మినహాయించడంతో పాటు, ప్రామాణీకరణ రుసుములపై 50 శాతం మినహాయింపును ప్రకటించారు.
ఈ మినహాయింపులు నవంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయి. నివాస, వాణిజ్య, పారిశ్రామిక మరియు పెట్టుబడి ఒప్పందాలు సహా అన్ని రకాల లీజులకు ఇది వర్తిస్తుందని ప్రకటించారు.
దీనితోపాటు కౌన్సిల్ హసద్ సెంటర్ ప్రాజెక్ట్‌ను ఆమోదించింది. ఇది ఆహార భద్రతకు మద్దతు ఇవ్వడానికి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మరియు షార్జాలోని రైతులకు సహాయం చేయడానికి రూపొందించబడిన ఒక ప్రాజెక్టు. ఈ కేంద్రం పండ్లు మరియు కూరగాయల సేకరణ కేంద్రంగా పనిచేస్తుంది. వాటి పంపిణీని సులభతరం చేస్తుంది. స్థానిక ఉత్పత్తిదారులకు మద్దతును అందిస్తుందని పేర్కొన్నారు.
షార్జా క్రౌన్ ప్రిన్స్ మరియు డిప్యూటీ పాలకుడు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి అధ్యక్షతన షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







