మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- October 29, 2025
మస్కట్: మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు తెరపడనుంది. ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కొత్తగా బ్రిడ్జిలు, టన్నెల్స్ ను నిర్మించనున్నారు. ఈ మేరకు ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అల్ మౌజ్ రోడ్ మరియు 18వ నవంబర్ స్ట్రీట్ ప్రధాన అభివృద్ధికి అధికారికంగా కాంట్రాక్టుకు ఆమోదం తెలిపింది. ఈ కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ మస్కట్‌లోని అత్యంత రద్దీగా ఉండే కారిడార్లలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించడం మరియు కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. అలాగే ఈ ప్రాంతంలో పెరిగిన వాణిజ్య, ఆర్థిక మరియు పర్యాటక కార్యకలాపాలకు ఈ ప్రాజెక్టు మద్దతుగా నిలుస్తుందని వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 18వ నవంబర్ స్ట్రీట్ వెంబడి ప్రతి దిశలో మూడవ లేన్‌ను, ఇది విమానాశ్రయ వంతెన నుండి అల్ ఇష్రాక్ రౌండ్అబౌట్ వరకు (అల్ సీబ్ బీచ్ వైపు) విస్తరణ పనులు, కీలకమైన ఇంటర్ జంక్షన్ల అప్గ్రేడ్లు చేయనున్నారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న అల్ మౌజ్ రౌండ్అబౌట్ కొత్త బ్రిడ్జి మరియు నాలుగు-మార్గాల ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ నిర్మాణం చేపట్టనున్నారు. అల్ బహ్జా రౌండ్అబౌట్ ఫ్లైఓవర్ మరియు వాహనాల కోసం అండర్‌పాస్ లను నిర్మిస్తారు.
తాజా వార్తలు
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!







