'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- October 29, 2025
గుంటూరు: ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ, అమరావతి, గుంటూరు హైవేలో 2026 జనవరి 3, 4, 5 తేదీలలో నిర్వహించబడనున్న మూడవ ప్రపంచ తెలుగు మహా సభల సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన "కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం" పోటీల విజేతలను పరిషత్తు ప్రకటించింది.
పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం జనవరి 3న సాయంత్రం 5 గంటలకు ప్రపంచ తెలుగు మహా సభల ప్రధాన వేదికపై ఘనంగా నిర్వహించబడుతుంది. పోటీ సమన్వయకర్త కార్టూనిస్ట్ హరి తెలిపారు . ఎంపికైన ఉత్తమ కార్టూన్లను తెలుగు మహా సభల సందర్భంలో ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కార్టూన్ ప్రదర్శనలో ప్రదర్శించనున్నారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.
విజేతలు:
🥇 ప్రధమ బహుమతి –రామ్ శేషు, నెల్లూరు
🥈 ద్వితీయ బహుమతి –సునీల్, అమలాపురం
🥉 తృతీయ బహుమతి –సరసి, హైదరాబాద్
ప్రోత్సాహక బహుమతులు:
బొమ్మన్, విజయవాడ
పర్శి నాయుడు, మన్యం జిల్లా
కోరాడ రాంబాబు
ఈ సందర్భంగా డా.గజల్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ పోటీలు తెలుగు భాషా, సంస్కృతి, భావప్రకటనల అభివృద్ధికి కార్టూన్ కళాకారులు అందిస్తున్న సేవలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంగా ఉన్నాయని అన్నారు. విజేతలుగా నిలిచిన కార్టూన్లను పత్రికలకు విడుదల చేసారు.



తాజా వార్తలు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు







