ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- October 29, 2025
యూఏఈ: ఫుజైరాలోని దిబ్బాలో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్ లో నీట మునిగి చనిపోయాడు. మరణించిన బాలుడి కుటుంబం తమ ఫాంహౌజ్ లో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇంటి పనిమనిషి బాత్రూమ్‌కి వెళ్లి వచ్చే లోగా బాలుడు కనిపించకుండా పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడి కోసం ఫాంహౌజ్ మొత్తం వెతికారు. స్విమ్మింగ్ పూల్ లో అచేతనంగా పడిఉన్న బాలుడికి గుర్తించి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని, అప్పటికే బాబు చనిపోయాడని డాక్టర్లు తెలిపారని వెల్లడించారు. స్విమ్మింగ్ లేదా ఏదైనా ప్రమాదకర కార్యకలాపాల సమయంలో పిల్లలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని తల్లిదండ్రులకు సూచించారు.
తాజా వార్తలు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు







