తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్

- October 29, 2025 , by Maagulf
తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్

చెన్నై: ఏదైనా పోటీ పరీక్షల ప్రకటన వెలువడిన వెంటనే నిరుద్యోగులకు ఎక్కడలేని సంతోషం వేస్తుంది. హమ్మయ్య ఇక తమ జీవితం అంతా సాఫీగా సాగిపోతుందనే గంపెడంత ఆశతో..రాత్రీపగలు కష్టపడి పరీక్షలు రాస్తారు. తప్పకుండా తమకు ఈ ఉద్యోగం వస్తుందని భావిస్తారు. కానీ కొందరు అక్రమాల వల్ల డబ్బు ఆశ చూపి, తప్పుడు మార్గంలో ఉద్యోగాలు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటివారి వల్ల తమ ఆశలకు భంగం కలిగించేవారికి ఎంతటి శిక్ష వేసినా తక్కువే అంటున్నారు. తమిళనాడులోని నిరుద్యోగులు. ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? మీరే చదవండి అసలు విషయాలు ఏమిటో.. తమిళనాడులో భారీ జాబ్ స్కామ్ బయటపడింది. రూ.35 లక్షలు లంచం చొప్పున తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు అమ్మేస్తున్న వైనం వెలుగుచూసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన సోదాల్లో ఈ భారీ కుంభకోణం బట్టబయలు అయ్యింది.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై తమిళనాడు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై విభాగంలో ఉద్యోగాల కోసం రూ.25లక్షల నుంచి రూ.35 లక్షలు వరకు ముడుపులు తీసుకుంటున్నారు. ఓ మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన సోదాల్లో ఈ జాబ్ స్కామ్ బట్టబయలయ్యింది. దీనితో వారు తమిళనాడు పోలీసు విభాగానికి లేఖ రాశారు. ఈ కుంభకోణంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులు, ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తోంది. స్టాలిన్ నే స్వయంగా నియామక పత్రాల అందవేత తమిళనాడు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై విభాగానికి సంబంధించి 2024లో రిక్రూట్మెంట్ చేపట్టారు. అసిస్టెంట్ ఇంజినీర్లు, టౌన్ ప్లానింగ్అ ధికారులు, జూనియర్ ఇంజినీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి.

ఈ ఉద్యోగాల కోసం దాదాపు 1.12 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే రిక్రూట్ మెంట్ పరీక్షను నిర్వహించి 2,538 మందిని ఉద్యోగంలో ఎంపిక చేశారు. ఈ ఏడాది ఆగస్టులో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్వయంగా వీరికి నియామక పత్రాలు అందజేశారు. బడా రాజకీయ నేత హస్తంపై అనుమానాలు ఈ నియామక ప్రక్రియలో చాలా అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. దాదాపు 150మంది అభ్యర్థులకు అనుకూలంగా పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని తెలిపింది. ఇందుకోసం ఆయా అభ్యర్థుల నుంచి ఏకంగా రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షలు చొప్పున లంచాలు తీసుకున్నట్లు గుర్తించామని చెప్పింది. ఈ స్కామ్ వెనుక తమిళనాడుకు చెందిన పలువురు బడా రాజకీయ నాయకులు, కొన్ని సంస్థలు ఉన్నాయని తెలిపింది. దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతూ తమిళనాడు హెడ్ ఆఫ్ పోలీస్ఈ డీ లేక రాసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com