బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన కబాలి..!
- July 23, 2016
గత సంవత్సరం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి' ప్రపంచ వ్యాప్తంగా ఒక్క ఊపు ఊపింది. భారీ వ్యూజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టంది. అయితే తెలుగు, తమిళ, హిందీ వర్షన్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఆయా భాషల్లో రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే..అయితే ఆస్థాయికి చేరుకోవాలంటే మరో అద్భుతం జరగాలి లేదా బాహుబలి 2 చిత్రమైన ఆ రికార్డు బ్రేక్ చేయాలని ఇప్పటి వరకు అనుకున్నారు. అయితే మొన్నామద్య రిలీజ్ అయిన సుల్తాన్ చిత్రం కూడా ఈ రికార్డు బద్దలు కొట్ట లేక పోయింది. కానీ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరో మాయ చేశారు.చాలా కూల్ గా ఎంట్రీ ఇచ్చి బాహుబలి రికార్డు బ్రేక్ చేశారు. పా రంజిత్ తెరకెక్కించిన కబాలి చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ చిత్రం మొన్న అమెరికా, యూకేలో విడుదలై పెను సంచలనాలు సృష్టించింది. ఇక సినీ అందరూ ఊహించినట్టే కబాలి యూఎస్ ప్రీమియర్ షోల విషయంలో 'బాహుబలి' రికార్డును క్రాస్ చేసేసింది. అమెరికాలో కబాలి సినిమా తెలుగు, తమిళ వర్షన్లలో 450కు పైగా స్క్రీన్లపై విడుదలైంది. ప్రీమియర్ షోల ద్వారా దాదాపు 13.4 కోట్ల రూపాయలు (2 మిలియన్ డాలర్లు) వసూలు చేసినట్టు సమాచారం.
అమెరికాలో బాహుబలికి 1.38 మిలియన్ డాలర్లు వచ్చాయి. కబాలి ఈ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. మొత్తానికి బాహుబలి రికార్డు బాహుబలి 2 నే అధిగమిస్తుందీ అనుకున్న తరుణంలో చాలా స్టైలిష్ గా కబాలి వచ్చి ఆ రికార్డు బ్రేక్ చేయడం తో రజినీ అభిమానులు కొండంత సంబరం చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







