వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- October 30, 2025
మస్కట్: ఒమన్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాలలో ఒకటిగా నిలిచింది. ఈ మేరకు గాలప్ 2025 గ్లోబల్ సేఫ్టీ రిపోర్ట్ వెల్లడించింది. ఒమన్ లోని 94% మంది నివాసితులు తాము సురక్షితంగా ఉన్నట్లు తెలిపినట్లు నివేదిక తెలిపింది.
గాలప్ నివేదిక 144 దేశాలలో 145,000 మందిని సర్వే చేసింది. వ్యక్తిగత భద్రత, చట్ట అమలుపై విశ్వాసం వాటి గురించి పాల్గొనేవారిని అడిగి వివరాలు సేకరించింది.
2024లో అత్యధిక భద్రతా అవగాహన కలిగిన 10 దేశాలలో ఐదు GCC సభ్య దేశాలు ఉన్నాయి. సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, బహ్రెయిన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాబితాలో చోటు సాధించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే సింగపూర్ 98% ర్యాంకింగ్స్‌తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత తజికిస్తాన్ (95%) మరియు చైనా (94%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అదే సమయంలో బోట్స్వానా 34% మరియు లెసోతో 34% స్కోరుతో జాబితాలో చివరన నిలిచాయి.
కాగా, ప్రపంచవ్యాప్తంగా 78% మంది పురుషులతో పోలిస్తే, 67% మంది మహిళలు మాత్రమే రాత్రిపూట ఒంటరిగా నడవడం సురక్షితంగా ఉందని భావిస్తున్నారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (CIC)తో భాగస్వామ్యంతో గాలప్ ఈ నివేదికను తయారు చేసింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







