సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!

- October 30, 2025 , by Maagulf
సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!

కువైట్: కువైట్ లో నిబంధనలకు విరుద్ధంగా సివిల్ ఐడిలో మార్పులు చేసిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) ఉద్యోగులు, ఒక ప్రవాస కంపెనీ ప్రతినిధితో సహా ఐదుగురు వ్యక్తులకు క్రిమినల్ కోర్టు జైలు శిక్ష విధించింది.

PACIలోని ఇద్దరు ఉద్యోగులు మరియు ఒక ప్రవాస ప్రతినిధికి ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించగా, ఒక అకౌంటెంట్ మరియు ఒక కంపెనీ ప్రతినిధికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.  లంచాలు తీసుకొని రెసిడెన్సీ చిరునామాలను మార్చారని, సివిల్ ఐడి కార్డులను జారీ చేయడం వంటి కేసుల్లో నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది.  ఈ బృందం ఫేక్ అద్దె ఒప్పందాలను కూడా తయారు చేసి పలు మోసాలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com