నెట్‌వర్క్ ఆస్పత్రులకు వన్‌టైం సెటిల్‌మెంట్ నిర్ణయం
- October 31, 2025 
            విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగంపై ప్రభావం చూపుతున్న ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ బకాయిల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వన్‌టైం సెటిల్‌మెంట్ కింద పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఈ సమస్యతో పాటు ఆశా వర్కర్ల సమ్మె కూడా ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. 20 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశా ప్రతినిధులతో అధికారులు నిన్న భేటీ అయ్యారు. సమ్మెను విరమించాలని అధికారులు విజ్ఞప్తి చేయగా, తమ డిమాండ్లపై ఈరోజు (మంగళవారం) నిర్ణయం వెల్లడిస్తామని వారు తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికే ₹250 కోట్లను విడుదల చేసి, పెండింగ్ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చినా, ఆశా వర్కర్లు సమ్మె విరమించలేదు. ఈ నేపథ్యంలో, ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను సాధ్యమైనంత వరకు వన్‌టైం సెటిల్‌మెంట్ చేయడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







