వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..

- October 31, 2025 , by Maagulf
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ రాబోతుంది. ఇకపై మీ చాట్ బ్యాకప్‌లు పాస్‌కీ ఎన్‌క్రిప్షన్‌తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ కొత్త అప్‌డేట్ తర్వాత వాట్సాప్ యూజర్లు తమ చాట్ బ్యాకప్‌లను సేఫ్‌గా ఉంచుకోవచ్చు.

ఏ పాస్‌వర్డ్ లేదా 6-అంకెల కీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాట్సాప్ బ్యాకప్‌ను ఫింగర్ ఫ్రింట్, ఫేస్ అన్‌లాక్ లేదా స్క్రీన్ లాక్ వంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఎన్‌క్రిప్ట్ చేయవచ్చు. యూజర్ డేటా గతంలో కన్నా మరింత సురక్షితంగా ఉంటుంది.

పాస్‌కీ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఏంటి?
మెటా బ్లాగ్ ప్రకారం.. పాస్‌కీ ఎన్‌క్రిప్షన్ వాట్సాప్ చాట్ బ్యాకప్‌లను కొత్త మార్గంలో సెక్యూర్ చేస్తుంది. ఈ ఫీచర్ ఫింగర్‌ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ లేదా లాక్ కోడ్ వంటి డివైజ్ ఇంటర్నల్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్ఉపయోగిస్తుంది. చాట్ బ్యాకప్‌లను ఎన్‌క్రిప్ట్ చేసిన యూజర్లు మాత్రమే డీక్రిప్ట్ చేయగలరు. “జీరో-నాలెడ్జ్” సిస్టమ్ అంటే వాట్సాప్ కూడా మీ బ్యాకప్‌లను ట్రాక్ చేయలేదు.

పాస్‌కీ బ్యాకప్‌ను ఎలా ఆన్ చేయాలి?
మీరు ఈ కొత్త ఫీచర్‌ను ఎనేబుల్ చేయాలంటే ఇలా ట్రై చేయండి :

  • వాట్సాప్ ఓపెన్ చేయండి.
  • Settings > Chats > Chat Backup > End to End Encrypted బ్యాకప్‌కు వెళ్లండి.
  • పాస్‌కీ ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ Enable చేయండి.
  • మీ ఫోన్ బయోమెట్రిక్ అథెంటికేట్ కోసం అడుగుతుంది.
  • వెరిఫై తర్వాత మీ చాట్ బ్యాకప్ పాస్‌కీతో ఎన్‌క్రిప్ట్ అవుతుంది.
  • ఈ ప్రాసెస్ తర్వాత మీ పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
  • మీ బ్యాకప్‌ను రిస్టోర్ కోసం మీ అథెంటికేట్ (ఫింగర్ ఫ్రింట్, ఫేస్ లేదా పిన్) మాత్రమే అవసరం.

పాస్‌కీతో వచ్చే మార్పు ఏంటి?
గతంలో, వాట్సాప్ యూజర్లు తమ బ్యాకప్‌లను సెక్యూర్ చేసేందుకు పాస్‌వర్డ్ లేదా 6-అంకెల కీని గుర్తుంచుకోవాల్సి వచ్చింది. అయితే, పాస్‌వర్డ్‌ను మరచిపోయినా లేదా వారి ఫోన్‌ను పోగొట్టుకున్నా, బ్యాకప్ పర్మినెంట్‌గా పోతుంది. పాస్‌కీ సిస్టమ్‌తో ఇకపై ఇలా జరగదు. ఎందుకంటే.. బ్యాకప్ మీ పాస్‌వర్డ్ మేనేజర్‌లో స్టోర్ అవుతుంది. ఏ డివైజ్ నుంచి అయినా సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుందంటే?
పాస్‌కీ ఎన్‌క్రిప్టెడ్ చాట్ బ్యాకప్ ఫీచర్‌ క్రమంగా అందరికి అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ మొదట ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటాలో టెస్టింగ్ అయింది. ఇప్పుడు స్టేబుల్ వెర్షన్‌లోకి వచ్చింది. రాబోయే వారాలు లేదా నెలల్లో అన్ని డివైజ్‌లకు అందుబాటులో ఉంటుంది. మీ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com