యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- October 31, 2025
యూఏఈ: యూఏఈలో నవంబర్ నెలకు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను వెల్లడించారు. అక్టోబర్ నెలకు సంబంధించి ఇంధన ధరలతో పోలిస్తే ధరలు తగ్గాయి. కొత్త ధరలు నవంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి.
ప్రస్తుతం సూపర్ 98 పెట్రోల్ అక్టోబర్లో Dh2.77గా ఉండగా, ఇప్పుడు లీటరుకు Dh2.63గా ఉంటుంది. అదే స్పెషల్ 95 పెట్రోల్ లీటరు ప్రస్తుత ధర Dh2.66గా ఉండగా, ఇప్పుడు Dh2.51గా ఉంటుంది. E-ప్లస్ 91 పెట్రోల్ అక్టోబర్లో Dh2.58గా ఉండగా, ఈనెల లీటరుకు Dh2.44గా ఉంటుంది. గత నెల Dh2.71గా ఉన్న డీజిల్ ధర, నవంబర్ నెల మొత్తం Dh2.67గా ఉంటుంది.
అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్ ధరలను నియంత్రించడానికి 2015లో యూఏఈ ఇంధన ధరలపై తనకున్న నియంత్రణను ఎత్తివేసింది. ప్రతి నెల ప్రారంభంలో ఇంధన ధరలను ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







