ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- October 31, 2025 
            దోహా: ఖతార్ సస్టైనబిలిటీ వీక్‌లో భాగంగా ఖతార్‌లో యువత కోసం టన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025ను ప్రారంభించినట్లు ఖతార్ మ్యూజియమ్ ప్రకటించింది. దీనిని ఖతార్ ఫౌండేషన్ ఎర్త్ నా సెంటర్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ నిర్వహిస్తుంది.
నవంబర్ 1 నుంచి 8 వ తేదీ వరకు అల్ బిడ్డా పార్క్‌లోని టీన్ హబ్‌లో జరుగుతుంది. ఎనిమిది రోజుల పాటు టీన్ హబ్ మరియు అల్ బిడ్డా పార్క్ సృజనాత్మకత, ఆవిష్కరణ మరియు పర్యావరణ అవగాహనను అందించే శక్తివంతమైన ప్రదేశంగా మారుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఇక నవంబర్ 2నుంచి 6వ తేదీ వరకు, టీన్ హబ్ వర్క్‌షాప్‌లు మరియు స్పెషల్ సెషన్‌లను నిర్వహిస్తుంది. వర్క్‌షాప్‌లు కంపోస్టింగ్ మరియు వ్యర్థాల తగ్గింపు, అప్‌సైకిల్డ్ ఆర్ట్, మైండ్‌ఫుల్ సెల్ఫ్ హీలింగ్ వంటి అంశాలపై ఉంటాయని టీన్ హబ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ అల్ ఇషాక్ తెలిపారు. యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







