బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!

- October 31, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!

మనామా: బహ్రెయిన్ లోని సిత్రా హౌసింగ్ సిటీలో రెండు కొత్త పబ్లిక్ పార్కులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వీటిని మునిసిపాలిటీల వ్యవహారాలు మరియు వ్యవసాయ శాఖల మంత్రి వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  గృహనిర్మాణ మరియు పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి అమ్నా బింట్ అహ్మద్ అల్ రుమైహితోపాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.   

స్థానిక సమాజాల అవసరాలకు అనుగుణంగా గ్రీనరీ ప్రాంతాలను విస్తరిస్తున్నారు.  పబ్లిక్ పార్కులలో సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్ లు, ఇతర మౌలిక సదుపాయాలను పెంచడానికి పనులు కొనసాగుతున్నాయని మునిసిపాలిటీల వ్యవహారాల మంత్రి వివరించారు.  పర్యావరణ అనుకూలంగా పట్టణాలను మార్చేందుకు గృహనిర్మాణ మరియు పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటున్నట్లు వెల్లడించారు.

మొదటి పార్క్ 2,104 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా, రెండవది 2,174 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. రెండింటిలోనూ ప్రత్యేకమైన ఆట స్థలాలు, విశాలమైన పచ్చని గార్డెన్లు, పిల్లలకు ఆట స్థలాలు మరియు సీటింగ్ జోన్‌లు ఉన్నాయని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com