ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- October 31, 2025
ఆసియా కప్ ముగిసిన నెల రోజులు గడిచినా ఇప్పటికీ ట్రోఫీ బీసీసీఐకి అందకపోవడం వివాదంగా మారింది. ఏసీసీ చీఫ్ నఖ్వీ ట్రోఫీని ఒకట్రెండు రోజుల్లో బీసీసీఐకి అందజేయనున్నారని సమాచారం. నవంబర్ 4న జరగబోయే ICC మీటింగ్కు ముందు ఈ ప్రక్రియ పూర్తవుతుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే, ట్రోఫీ అప్పగింతలో జాప్యం ఎందుకు జరుగుతోందన్నది ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
బీసీసీఐ సెక్రటరీ దేబోస్మిత్ సైకియా ఈ ఆలస్యంపై స్పష్టంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “టోర్నీ ముగిసిన తర్వాత ఇంత కాలం ట్రోఫీ ఇవ్వకపోవడం సరికాదు. బీసీసీఐ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ట్రోఫీ రాకపోతే ఈ విషయం ICC దృష్టికి తీసుకెళ్తాం,” అని హెచ్చరించారు. ఇక ట్రోఫీ అందిన వెంటనే అది ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ACC చీఫ్ నఖ్వీ ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే, బీసీసీఐ వర్గాలు ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్లో ఉందని, అక్కడి నుండి త్వరలో భారత్కు పంపించనున్నారని చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ACC మరియు BCCI మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. క్రికెట్ అభిమానులు మాత్రం ట్రోఫీ బీసీసీఐ చేతుల్లోకి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







