సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- October 31, 2025 
            ముంబై: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం ముంబైలో జరిగింది. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ శిండే మనవరాలి వివాహ వేడుకలో పాల్గొనేందుకు రేవంత్ నిన్న ముంబైకి వెళ్లారు. ఆ సందర్భంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేకంగా సీఎం రేవంత్‌ను కలిశారు.
ఈ భేటీ పూర్తిగా స్నేహపూర్వక వాతావరణంలో సాగినట్లు తెలిసింది. సల్మాన్, రేవంత్ రెడ్డి మధ్య సినీ రంగం, తెలంగాణలో సినిమా నిర్మాణ అవకాశాలు, మరియు రాష్ట్రం యొక్క సాంస్కృతిక ప్రాధాన్యత వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ అనే నినాదం గురించి సీఎం రేవంత్ వివరించగా, సల్మాన్ ఖాన్ ఆ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ, దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులు, టూరిజం, సినీ రంగ ప్రోత్సాహంపై రేవంత్ చేపడుతున్న కార్యక్రమాలను సల్మాన్ ప్రశంసించినట్లు సమాచారం. ఈ భేటీ రెండు రాష్ట్రాల మధ్య సినీ, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశంగా రాజకీయ, సినీ వర్గాలు చూస్తున్నాయి.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







