2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC

- November 01, 2025 , by Maagulf
2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC

- దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 2025 డిసెంబర్‌లో ప్రమాణ స్వీకార వేడుక
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రొఫెషనల్స్, ఇన్నోవేటర్స్, మరియు వ్యాపార నాయకులను ఆహ్వానం.
- నవంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరణ

హైదరాబాద్: ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTITC) తెలుగు మాట్లాడే సాంకేతిక నిపుణులు మరియు వ్యాపారవేత్తలను ప్రాతినిధ్యం వహించే అంతర్జాతీయ సంస్థ 2026 నాయకత్వ స్థానాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుత నాయకత్వ కాలం ముగియనుండగా డబ్ల్యూటిఐటిసి నూతన అంతర్జాతీయ నాయకత్వ బృందాన్ని ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది.ఈ కొత్త బృందం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్లకు ప్రాతినిధ్యం వహించనుంది.కొత్తగా నియమించబడిన ఇంటర్నేషనల్ చాప్టర్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మరియు కార్యదర్శులు తమ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 2025 డిసెంబర్‌లో దుబాయ్, యూఏఈలో జరగనున్న ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక సదస్సు సందర్భంగా నిర్వహించనున్నారు.

దుబాయ్‌లో జరగబోయే ఈ సదస్సు, తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యాపార వ్యవస్థాపకులు, మరియు ఇన్నోవేటర్లలో పెద్దది, ప్రతిష్టాత్మకమైనదిగా ఉండనుంది. గతంలో సింగపూర్‌లో జరిగిన ఈ గ్లోబల్ ఈవెంట్‌లో 100కి పైగా దేశాల నుండి వచ్చిన 3,000కు పైగా ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. తెలుగు ప్రతిభ, టెక్నాలజీ, మరియు వ్యాపార వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై ఆ సందర్భంలో ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా WTITC చైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా మాట్లాడుతూ...డబ్ల్యూటిఐటిసి 2026 అంతర్జాతీయ చాప్టర్స్‌కు నామినేషన్లు ఆహ్వానిస్తున్నామని ప్రకటించడం మాకు గర్వంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, నాయకులు అందరికీ అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో భాగమయ్యే అద్భుత అవకాశం. కొత్త చాప్టర్ నాయకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రొఫెషనల్స్‌ను కలుపుతూ, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, భారతదేశం మరియు గ్లోబల్ టెక్ కమ్యూనిటీ మధ్య సహకారాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. దుబాయ్‌లో జరగబోయే గ్రాండ్ ప్రమాణ స్వీకార వేడుక, డబ్ల్యూటిఐటిసికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్లందరికీ గర్వకారణమైన చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది.

డబ్ల్యూటిఐటిసికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, ఇన్నోవేటర్లు, పరిశోధకులు, మరియు టెక్నాలజీ సంస్థలను నాయకత్వ పదవులకు దరఖాస్తు చేయడానికి లేదా గ్లోబల్ కౌన్సిల్ సభ్యులుగా చేరడానికి ఆహ్వానిస్తోంది. డబ్ల్యూటిఐటిసిలో భాగమవడం ద్వారా వ్యక్తులు మరియు సంస్థలు అంతర్జాతీయ నిపుణులతో కలవడం, ప్రపంచవ్యాప్త వ్యాపార అవకాశాలను అన్వేషించడం, అలాగే టెక్నాలజీ మరియు ఆవిష్కరణ రంగాల్లో తెలుగు ప్రతిభను గౌరవించే గ్లోబల్ ఉద్యమంలో భాగస్వాములవడం సాధ్యమవుతుంది.

నవంబర్ 15వ తేదీన వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం నమోదు మరియు నామినేషన్ లింక్ డబ్ల్యూటిఐటిసి అధికారిక వెబ్‌సైట్ http://www.wtitc.orgలో అందుబాటులోకి వస్తుంది. మరిన్ని వివరాలు  డబ్ల్యూటిఐటిసిలో +91 81231 23434 (భారతదేశం) +971 56577 8923 (యూఏఈ) సంప్రదించవచ్చు. 

హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన డబ్ల్యూటిఐటిసి 60కి పైగా దేశాల నుండి టెక్నాలజీ నిపుణులు, సంస్థలు, స్టార్టప్‌లను కలిపి, సేంకేతిక నైపుణ్యాలను, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించే వేదికను సృష్టిస్తోంది. 2026 అంతర్జాతీయ చాప్టర్ నియామకాలు మరియు దుబాయ్‌లో జరగబోయే ఘన ప్రమాణ స్వీకార వేడుకతో, డబ్ల్యూటిఐటిసి తన ఆవిష్కరణాత్మక, భవిష్యత్తుకి సిద్ధమైన గ్లోబల్ తెలుగు టెక్నాలజీ కమ్యూనిటీ నిర్మించడానికి తన మిషన్‌ను కొనసాగిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com