ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- November 02, 2025
మస్కట్: ఒమన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన తలాబత్ ఆర్డర్లు మరియు డెలివరీ సేవలకు అంతరాయం ఏర్పడింది. గత రెండు రోజులుగా తాము ఆర్డర్లు ఇవ్వడం సాధ్యం కావడం లేదని కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, సేవలు నిలిచిపోవడంపై తలాబత్ ఒమన్ అధికారికంగా స్పందించలేదు.
మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులు చాలా రెస్టారెంట్లు "మూసివేయబడ్డాయి" లేదా "అందుబాటులో లేవు" అని మెసేజ్ చూపిస్తున్నట్లు తెలిపారు.
ఒమన్‌లో చాలా మందికి తలాబత్ రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఇందులో దాదాపు 5 వేల వరకు సెల్లర్స్ ఉన్నారు. కొనసాగుతున్న టెక్నికల్ సమస్య కస్టమర్లను ప్రభావితం చేయడమే కాకుండా, ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన అనేక స్థానిక రెస్టారెంట్లు మరియు డెలివరీ డ్రైవర్ల కార్యకలాపాలు, వారి ఆదాయాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







