ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- January 11, 2026
మనామా: 2025 మూడవ త్రైమాసికానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం..అత్యధిక ఆర్థిక స్వేచ్ఛ కలిగిన దేశాలలో బహ్రెయిన్ గల్ఫ్‌లో మొదటి స్థానంలో మరియు అరబ్ ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచింది.
ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ 2025 ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ ఇండెక్స్‌ను నివేదిక ఉదహరణగా పేర్కొంది. ఇది 165 దేశాలను రెగ్యులేషన్, సౌండ్ మనీ, అంతర్జాతీయంగా వాణిజ్యం చేయడానికి స్వేచ్ఛ, సైజ్ ఆఫ్ గవర్నమెంట్ మరియు న్యాయ వ్యవస్థ ఆధారంగా ర్యాంకులను కేటాయించారు.
రెగ్యులేషన్ విభాగంలో అరబ్ ప్రపంచంలో బహ్రెయిన్ మొదటి స్థానంలో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే GCC దేశాలు సమిష్టిగా సౌండ్ మనీ మరియు ప్రభుత్వ సూచికల పరిమాణంలో ముందున్నాయని పేర్కొంది.ఈ ఫలితాలు బహ్రెయిన్ బలమైన ఆర్థిక విధానాలను ప్రతిబింబిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
అంతర్జాతీయ సూచికలలో బహ్రెయిన్ పురోగతి..ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని నివేదిక లో స్పష్టం చేశారు.వివాద పరిష్కారంలో బహ్రెయిన్ ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది. చట్టపరమైన మరియు వాణిజ్య వివాదాలను నిర్వహించడంలో 100లో 74.05 స్కోర్ చేసింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







