రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!

- November 03, 2025 , by Maagulf
రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!

రియాద్: రియాద్, తబుక్ మరియు మక్కా ప్రాంతాలలో సైరన్ వ్యవస్థను పరీక్షించారు. ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది.

రియాద్ లోని దిరియా, అల్-ఖార్జ్ మరియు అల్-దిలామ్ గవర్నరేట్‌లు, తబుక్ లోని గవర్నరేట్‌లు మరియు మక్కా లోని జెడ్డా మరియు తువాల్ గవర్నరేట్‌లలో సైరన్లను మోగించారు. ఈ ట్రయల్ కమ్యూనిటీ అవగాహన పెంచడంతో పాటు హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని మరియు అత్యవసర పరిస్థితుల్లో నివాసితులను అప్రమత్తం చేయడానికి వారి సంసిద్ధతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com