వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- November 03, 2025
దోహా: ఖతార్ లో నవంబర్ 4న జరిగే వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్ ను పురస్కరించుకొని ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. సమ్మిట్ సందర్భంగా పలు రహదారులను మూసివేయనున్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పలు రహదారులను మూసివేస్తారు.
హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డు నుండి రాస్ బు అబ్బౌద్ రోడ్డు ద్వారా అల్ షార్క్ ఇంటర్‌చేంజ్ వరకు, సి-రింగ్ రోడ్డులోని ఎయిర్‌పోర్ట్ పార్క్ స్ట్రీట్ నుండి అల్ షార్క్ ఇంటర్‌చేంజ్ వరకు, అల్ షార్క్ ఇంటర్‌సెక్షన్ నుండి నేషనల్ థియేటర్ ఇంటర్‌చేంజ్ వరకు కార్నిచ్ రోడ్డును మూసివేస్తారు. అలాగే, మొహమ్మద్ బిన్ థాని స్ట్రీట్ నేషనల్ థియేటర్ ఇంటర్‌చేంజ్ నుండి వాడి అల్ సెయిల్ ఇంటర్‌చేంజ్ వరకు, వాడి అల్ సెయిల్ ఇంటర్ సెక్షన్ నుండి అల్ మహా ఇంటర్‌చేంజ్ వరకు అల్ బిదా స్ట్రీట్., అల్ మహా ఇంటర్ సెక్షన్ నుండి ఘర్రఫత్ అల్ రేయాన్ ఇంటర్‌చేంజ్ వరకు ఖలీఫా స్ట్రీట్., లైకేఫియా ఇంటర్ సెక్షన్ నుండి గోల్ఫ్ క్లబ్ ఇంటర్‌చేంజ్ వరకు గోల్ఫ్ స్టేడియం స్ట్రీట్ వరకు ట్రాఫిక్ ను అనుమతించరు.
నవంబర్ 4 నుండి 6 వరకు దోహాలో రెండవ వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్ జరుగుతుంది. ఇందులో పలు దేశాధినేతలు మరియు ప్రభుత్వాధినేతలు, అలాగే అంతర్జాతీయ మరియు ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







