పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- November 03, 2025
దుబాయ్: రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా దుబాయ్ పర్యటనకు వెళ్ళారు మంత్రి నారాయణ..ఈ నెల 14,15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు కు దుబాయ్ పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానిస్తున్నారు...రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు,ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను దుబాయ్ ఇన్వెస్టర్స్ కు వివరిస్తున్నారు.దుబాయ్ పర్యటనలో భాగంగా మొదటి రోజు ఉదయం దుబాయ్ ఇండియా కాన్సుల్ ప్రతినిధులు B.G. కృష్ణన్,సెలీనా శశికాంత్ తో మంత్రి నారాయణ బృందం భేటీ అయింది...దుబాయ్ పర్యటనలో పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు,ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి గురించి ఎంబసీ ప్రతినిధులకు వివరించారు...ఆ తర్వాత శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్త తో మంత్రి నారాయణ సమావేశమయ్యారు...రియల్ ఎస్టేట్,ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో శోభా గ్రూప్ ప్రపంచ ప్రసిద్ధి పొందింది..ఏపీలో మౌళిక వసతుల కల్పన కు ముందుకు రావాలని శోభా రియాల్టీ గ్రూప్ ప్రతినిధులను మంత్రి నారాయణ ఆహ్వానించారు..భాగస్వామ్య సదస్సు ద్వారా ఏపీ ని పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా మార్చే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి వివరించారు.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు శోభా గ్రూప్ ముందుకొచ్చింది...
మధ్యాహ్నం దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రి నారాయణ.ఆంధ్ర ప్రదేశ్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకెళ్తున్నామ నీ...సింగిల్ డెస్క్ విధానంలో అన్ని అనుమతులు జారీ చేసి త్వరితగతిన పరిశ్రమలు గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు..ఏపీ విధానాలు పరిశీలించి దుబాయ్ పారిశ్రామిక వేత్తలను పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని సతీష్ మీనన్ ను కోరారు..
మొదటి రోజు సాయంత్రం దుబాయ్ లోని KEF హోల్డింగ్స్ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ ఫైజల్ కొట్టికోలన్(faizal kottikollon)తో మంత్రి నారాయణ బృందం భేటీ అయింది...ఇన్ఫ్రాస్ట్రక్చర్,హెల్త్ కేర్,టెక్నాలజీ రంగాల్లో ఈ సంస్థ అనేక దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తుంది..వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా KEF హోల్డింగ్స్ చైర్మన్ ను మంత్రి నారాయణ కోరారు...వైద్యారోగ్య రంగంలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో తీసుకొస్తున్న అనేక మార్పులను మంత్రి వివరించారు...విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరై తమ ప్రభుత్వం కల్పిస్తున్న పారిశ్రామిక విధానాలను పరిశీలించాలని సూచించారు...
ఈ పర్యటనలో మంత్రి నారాయణ తో పాటు సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు,మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్,రిటైర్డ్ IAS శ్రీనివాస్ ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







