'మైసా' మొదలయ్యింది..
- November 03, 2025
            నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుసగా క్రేజీ సినిమాలు చేస్తోంది. త్వరలో ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదల కానుంది. కన్నడ హీరో దీక్షిత్ శెట్టి హీరోగా చేస్తున్న ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టును మొదలుపెట్టింది రష్మిక. అదే మైసా. ఈ సినిమాలో గోండ్ గిరిజన మహిళగా కనిపించనుంది. దీనికి సంబందించిన పోస్టర్ కూడా ఇప్పటికే విడుదల చేశారు మేకర్స్.(Mysaa) మొహానికి రక్తంతో చేతిలో బల్లెం పట్టుకొని చాలా పవర్ ఫుల్ గా ఉన్న రష్మిక పోస్టర్ ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది.
ఇక తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు మేకర్స్. కేరళలోని అథిరప్పిల్లీలో ఈ షూటింగ్ మొదలయ్యింది. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రవీంద్ర పుల్లే ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవ్వనున్నాడు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ రెండు ఒకే టైంలో పూర్తి చేసి అతి త్వరగా సినిమాను విడుదల చేయాలనీ చూస్తున్నారు మేకర్స్. ఇటీవలి కాలంలో చాలా సినిమాలకు తన అద్భుతమైన మ్యూజిక్ తో ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇస్తున్న జాక్స్ బెజోయ్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక పుష్ప 2లో విలన్ గా నటించిన తారక్ ఈ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 - బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
 - పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
 - రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
 - వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
 - ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
 - కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
 







