బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
- November 04, 2025
మనామా: బహ్రెయిన్-భారత్ సంయుక్త మంత్రివర్గ కమిటీ ఐదవ సెషన్ భారత రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభం అయ్యాయి. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ మరియు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగాడిసెంబర్లో జరగనున్న గల్ఫ్ సమ్మిట్‌కు బహ్రెయిన్ అధ్యక్షత వహించడాన్ని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం ప్రశంసించారు. పలు రంగాలలో ఇరు దేశాలు సాధించిన స్పష్టమైన పురోగతిని సాధించాయని తెలిపారు. బహ్రెయిన్‌లోని భారతీయ కమ్యూనిటికి అందిస్తున్న మద్దతు మరియు సంరక్షణకు భారత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
దిల్మున్ మరియు సింధు లోయ పురాతన నాగరికతల మధ్య దాదాపు ఐదు వేల సంవత్సరాల సాంస్కృతిక మార్పిడి మరియు వాణిజ్యంలో సంబంధాలు ఉన్నాయని బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అల్ జయానీ గుర్తుచేశారు. బహ్రెయిన్ -భారత్ మధ్య ఆర్థిక సంబంధాలు ద్వైపాక్షిక సంబంధానికి మూలస్తంభంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి మరియు అభివృద్ధి రంగాలలో సహకారాన్ని విస్తరించడానికి మార్గాలను ఈ సందర్భంగా సమీక్షించారు. అదే సమయంలో భద్రత, ఆరోగ్యం, సంస్కృతి, విద్య, పర్యాటకం, అంతరిక్ష శాస్త్రాలు మరియు రెండు దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే ఇతర కీలక రంగాలలో సహకారంపై కూడా చర్చించారు.
తాజా వార్తలు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు







