హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..

- November 04, 2025 , by Maagulf
హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..

హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్.. భారతీయులకు ఊరట..

అమెరికా: నిధుల లోపం కారణంగా అమెరికా(America) ప్రభుత్వం(Visa) షట్ డౌన్ అయింది. ఈ క్రమంలో యూఎస్ లేబర్ డిపార్ట్ మెంట్ కూడా మూతపడింది. దీంతో హెచ్-1బి, హెచ్-2ఎ, హెచ్-2బి వీసాల ప్రాసెసింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడ ఇది మొదలైందని అమెరికా లేబర్ డిపార్ట్వమెంట్ అనౌన్స్ చేసింది. ఫారిన్ లేబర్ అప్లికేసన్ గేట్ వే (ప్లాగ్) సిస్టమ్ తిరిగి ప్రారంభమైంది. దీంతో అమెరికాలో ఉన్న కంపెనీలు..విదేశీ వర్కర్లను నియమించుకోవడానికి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ప్రాసెస్ లో ఉన్న అప్లికేషన్ల స్టేటస్ ను తెలుసుకోవడం, కొత్త వాటిపై అప్లై చేసుకోవడం లాంటివి ఇక మీరు చేయవచ్చు అని పేర్కొంది. ఒకరకంగా హెచ్ 1బీతో పాటు ఇతర వీసాలతో ఉద్యోగాలు పొందాలనుకుంటున్న వారికి మంచి పరిణామం.

అమెరికాలో పని చేయాలంటే లేబర్ సర్టిఫికెట్లు కావాలి. దీన్ని ఒఎఫ్ ఎల్సి ఇస్తుంది. హెచ్-1బి, హెచ్-2ఎ, హెచ్-2బి వీసాలతో (Visa) విదేశీ వర్కర్లను నియమించుకోవాలంటే అమెరికాలోని కంపెనీలు ఈ సర్టిఫికెట్ ను పొందాలి. అయితే ఫ్లాగ్ అనే ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒఎఫ్ ఎల్సి సర్టిఫికెట్ ఉంటేనే.. యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వద్ద హెచ్ 1బీ లాంటి వీసా పిటిషన్లు వేసుకోవడానికి వీలు కలుగుతుంది. లేకుంటే వీసా ప్రాసెస్ ముందుకు కదలదు. కాగా, విదేశీ టెక్ నిపుణుల కోసం ఇచ్చేది హెచ్ 1బీ వీసా. ఇక తాత్కాలిక వ్యవసాయ రంగంలో ఉద్యోగాల కోసం హెచ్-2ఎ వీసా ఇస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com