థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- November 05, 2025
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా సినిమా థియేటర్ల లో టికెట్ ధరలతో పాటు తినుబండారాల రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిస్థితిపై సుప్రీంకోర్టు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. సినిమా చూసే సామాన్య ప్రేక్షకుడి పై భారం రోజురోజుకీ పెరుగుతోందని, టికెట్తో పాటు పాప్కార్న్, కూల్ డ్రింక్స్ వంటి ఫుడ్ ఐటమ్స్ ధరలు సాధారణ ప్రజలకు అందనంతగా మారిపోయాయని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇటీవల కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను రూ.200కు పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మల్టీప్లెక్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
“ఇప్పటికే సినిమాకి వెళ్ళాలంటే కనీసం ₹1,500 నుంచి ₹2,000 వరకు ఖర్చవుతోంది. ఒక కుటుంబం సినిమా చూడాలంటే అది భారంగా మారింది. థియేటర్లలో ఫుడ్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇది కొనసాగితే సినిమా హాళ్లు త్వరలోనే ఖాళీగా మారే ప్రమాదం ఉంది” అని ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







